Feb 08,2021 16:54

విజయనగరం టౌన్‌: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసిలో విదేశీ పెట్టుబడులు 74 శాతం పెట్టే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎల్‌ ఐ సి ఉద్యోగ సంఘాల డిమాండ్‌ చేశాయి. ఎల్‌ఐసిలో ఎఫ్‌డిఐ 74 శాతాన్ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం అమొందించడాన్ని వెంటనే విరమించుకోవాలని నాయకులు పి.శ్రీనివాసరావు, జీవి ఎల్‌ ఎస్‌ ప్రసాద్‌ లు డిమాండ్‌ చేశారు. సోమవారం ఎల్‌ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎల్‌ఐసి అభివఅద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడుదార్లుకు అప్పగించే నిర్ణయంలో భాగంగా ఇటువంటి నిర్ణయాలు కేంద్రం చేస్తుందన్నారు. దేశ ప్రజల దాసుకున్న డబ్బులకు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే రక్షణ ఉంటుందన్నారు. లక్షలు కోట్లు ప్రభుత్వానికి ఇచ్చి సహకరిస్తున్న ఎల్‌ఐసి ఆస్తులను పెట్టుబడుదార్లుకు అప్పనంగా అప్పగించే నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. వెంటనే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఎల్‌ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు.