న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 16.3 శాతం పతనమై 71 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బిఐ గణంకాలు వెల్లడించాయి. ఇంతక్రితం ఏడాదిలో 84.8 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో 38.6 బిలియన్ డాలర్లుగా ఉన్న నికర ఎన్‌పిఎలు.. 2022-23లో 28 బిలియన్లకు పడిపోయాయని ఆర్‌బిఐ తన తాజా మాసం బులిటెన్‌లో వెల్లడించింది. తయారీ రంగం, కంప్యూటర్ సర్వీసెస్, కమ్యూనికేషన సర్వీసెస్‌లో అధికంగా ఎఫ్‌డిఐలు పడిపోయాయి. అదే విధంగా అమెరికా, స్విట్జర్లాండ్, మారిషాస్ నుంచే వచ్చే పెట్టుబడుల్లోనూ తగ్గుదల చోటు చేసుకుంది. గతేడాది సెమీకండక్టర్ పరిశ్రమలో అత్యధికంగా 26.2 బిలియన్ల ఎఫ్‌డిఐలు వచ్చాయి. పరిశ్రమల అభివృద్థికి ప్రభుత్వం చేపడుతున్న చొరవకు అనుగుణంగానే పెట్టుబడులు వస్తున్నాయని ఆర్‌బిఐ పేర్కొంది. గడిచిన ఏప్రిల్‌లో విదేశీ పోర్ట్టుపోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ)లు ఈక్విటీ సెగ్మెంట్‌లో 1.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.










