తర తరాలుగా వాడు
రెక్కల కష్టం కాజేసినా
చలించని గొర్రె మెదళ్ళు
బానిసత్వం కట్టబెట్టినా
పలుకుల్లేని మూగ నోళ్లు
బతుకు సమాధి కట్టినా
కదల్లేని బండ గుణాలు
హక్కులను తెగ్గోసినా
మారలేని జడ శాల్తీలు
స్వేచ్ఛను హరించినా
సోయిరాని సోంబెరీలు
ఈ ఆధిపత్య పోకడలు
ఇంకెంతకాలం భరించేది?
ఈ ఉక్కు పాదాల కింద
చచ్చిన శవాల్లా పడుండేది?
ఇప్పటికైనా...
తాడితులారా..పీడితులారా
బడుగుల్లారా ఏకంకండోరు
బాధితులారా రోధితులరా
ప్రజాసంఘం కట్టండోరు
కదంతొక్కి కవాతు చేస్తూ
సమరభేరి మ్రోగించండోరు
సమీకరిస్తూ...సంఘర్షిస్తూ
ఎర్ర బావుటా ఎత్తండోరు
ప్రచండిస్తూ.. పరాక్రమిస్తూ
కదనరంగంలో దూకండోరు
నినదిస్తూ.. నింగికెగుస్తూ
ఉద్యమానికి తరలండోరు
విప్లవిస్తూ.. విజృంభిస్తూ
దోపిడీ రాజ్యం కూల్చండోరు
స్వేచ్ఛా గీతం పల్లవించండోరు
కోడిగూటి తిరుపతి
95739 29493