Apr 27,2023 16:59
  • జేఎన్టీయూ విసి ప్రసాదరాజు

ప్రజాశక్తి-కాకినాడ : సమాజానికి మార్పునకు ఉపయోగ పడే వార్తలను అందించడంలో ఎడిటర్స్ (సంపాదకుల) పాత్ర అత్యంత కీలకమని కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్సర్ డాక్టర్ జివిఆర్ ప్రసాద్ రాజు అన్నారు. ఈ సందర్భంగా విసి ప్రసాద్ రాజు సమక్షంలో ఎడిటర్స్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. గురువారం ఎడిటర్స్ అసోసియేషన్ ఆవిర్భావ, లోగో ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జేఎన్టీయూలోని విసి చాంబర్ వద్ద ఉన్న సెనేట్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి విసి ప్రసాదరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రాజు మాట్లాడుతూ పత్రిక సంపాదకులు తమ కింది విలేకరులు సేకరించిన వార్తలను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజాహితానికి ఉపయోగపడే విధంగా మార్పు చేయడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. ఆవేశ పూరిత వార్తలు రాయవద్దని, ఆలోచనపూర్వంగా రాసి మన్ననలను పొందాలని విసి సూచించారు. ఎన్నో కష్ట నష్టాలను వ్యయా ప్రయాసలను కూర్చి వారే సొంతంగా పత్రికలను, చానళ్లను నడుపుతున్న సంఘటనలు ఉన్నాయని వాటిని ప్రజల దగ్గర చేర్చడంలో వారి నేర్పరితనం బయటి కనిపిస్తుందన్నారు. ప్రస్తుత తరుణంలో పత్రిక నిర్వహణ చాలా కష్టంగా ఉందని ఆయన తెలిపారు. పత్రిక తరపున అతను సంపాదకుడుగానే ఉంటాడని సంపాదన మాత్రం అతనికి ఉండదని చెప్పారు. గతంలో కార్పొరేట్ సంస్థలకు చెందిన వాళ్లు ఎడిటర్లను నియమించుకొని పత్రికలను, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలను నిర్వహించేవారని ప్రస్తుతం అనుభవం ఉన్న వారే వాటిని స్వతహాగా ఏర్పాటు చేసి నిర్వహించడం పట్ల ప్రసాదరావు ఆనంద వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఎడిటర్స్ లోగోను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్ట్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఎడిటర్స్ లేదా విలేకరులకు గాని ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిశీలించేందుకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
   ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాలు,  యూనియన్ నాయకులు పుర్రె శ్రీనాథ్, వల్లూరు నానాజీ, కే జయశ్రీను, శ్రీధర్ పితాని రాము, పిఎస్ఎం కృష్ణంరాజు, డి అంజిబాబు, పెంటపాటి చంద్రశేఖర్, ఎం శివరామకృష్ణ, డి మోహన్, జి శోభన్ బాబు, దుర్రాని, వర్మ, వి దుర్గారావు, వైసీపీ నాయకులు జే రామశర్మలు అమూల్యమైన సందేశాలను అందించారు. అనంతరం సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించి సలహాలను తీసుకున్నారు.