Jun 03,2023 15:43

ప్రజాశక్తి-ఆదోని : గ్రూప్ 2 పోస్టుల‌తోపాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ పోస్టులను భర్తీచేసి నిరుద్యోగుల‌ను ఆదుకోవాల‌ని డిఎస్ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. శ‌నివారం ఆదోనిలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఏళ్ల తరబడి ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతున్నారని అన్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రతిబంధంగా ఉన్న జీఓ275ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టుల‌కు సంబంధించిన‌ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరారు.