ప్రజాశక్తి-నందిగామ : డూలాస్ ట్రస్ట్ పే బ్యాక్ టి సొసైటీ అంబేద్కర్ నినాదాన్ని అమలు చేస్తున్నదని వక్తలు పేర్కొన్నారు. సొంత గడ్డపై మమకారంతో సేవా కార్యక్రమాలు డాక్టర్ మణి ఆనంద్ ట్రస్ట్ చైర్మన్ సేవలు మరువలేనివని తెలిపారు. నందిగామ మధిర రోడ్డు ఆర్ఎస్ ఫంక్షన్ హాల్ లో క్రీస్తు సేవా సంఘం ,డూలాస్ ఫ్యామిలీ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులు వృద్ధులు వితంతువులు లకు శుక్రవారం నూతన వస్త్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నందిగామ ఎమ్మెల్యే డా.మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ డా.మొండితోక అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు, రక్షణ టీవీ ఎండి బెన్ హర్, విదేశీయురాలు (అమెరికా)హామర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉందని, కొంతమంది సంపాదించడం తప్ప సహాయం చేయాలని ఉద్దేశం ఉండదని, దానికి భిన్నంగా ఉన్న మణి ఆనంద్ ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. తనకొచ్చిన సంపాదనలో కొంత భాగం పేదలకు పంచడం ఆనందదాయకంగా ఉందని దేవుడిచ్చిన పిలుపుమేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అన్నారు. జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పే బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని ఆచరిస్తూ తన జ్ఞానాన్ని, సమయాన్ని, ధనాన్ని పేదలకు తిరిగి ఇవ్వడం కోసం శ్రమిస్తున్న వ్యక్తి మణి ఆనంద్ అని కొనియాడారు. పేదల కోసం, పాపుల కోసం సిలువ మీద బలిదానం చేసి ఁకీస్తు త్యాగం చేశారని, నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి ఆయన తండ్రి దేవసహాయం అన్నారు. అమెరికన్ మహిళ హేమర్ మాట్లాడుతూ దేశంలో చాలామంది విద్య, వైద్యం లేక అలమటిస్తున్నారని అలాంటి వారికి ఆసరాగా డూలాస్ ట్రస్ట్ నిలుస్తుందని ఆమె అన్నారు. రక్షణ టీవీ ఎండి బెన్ హర్ మాట్లాడుతూ అరకు, ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంటు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ అందరూ బాగుండాలి అని మణి ఆనంద్ వైద్య సేవలు అందిస్తూ సేవా దృక్పథం కలిగి ఉండ ఆనందదాయకం అన్నారు. అనంతరం వృద్దులు, వితంతువులు, అనాధ పిల్లలకు, ఫాస్టర్ లకు నూతన వస్త్రాలు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమం లో వైసిపి నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, నందిగామ ఎఎంసి ఛైర్మన్ మస్తాన్, నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు,బొల్లినేని శ్రీనివాసరావు, పోపూరి సంగీతరావు తదితరులు పాల్గొన్నారు.










