Sep 16,2023 15:38

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : పిచ్చికుక్క దాడిలో యు కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో సుమారు 15 మందికి గాయాలు పాలయ్యారు.శుక్రవారం రాత్రి పిచ్చికుక్క ఇష్టారాజ్యంగా రోడ్డుపై వెళ్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసి పలువురిని గాయపరిచింది.కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, వాకతిప్ప గ్రామాలకు చెందిన  ప్రజలను విద్యార్థులను పిచ్చికుక్క దాడిలో గాయాలు పాలయ్యారు. అధికంగా గాయాలైన వారిని హుటాహుటిన 108 పై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మరికొందరు స్థానిక ప్రైవేటు ఆసుపత్రి,,స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. పిచ్చి కుక్క కోసం శనివారం గ్రామాల్లో యువకులు. పహారా కాస్తున్నారు మరో వ్యక్తులపై దాడి చేయకుండా గస్తీ కాస్తున్నామన్నారు పిచ్చికుక్క దొరికే వరకు గ్రామాల్లో ప్రజలంతా. అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతున్నారు.