- కమిషనర్ రావిరాల హెచ్చరిక
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు సుబ్బరం చేస్తూ ఉరుగనీరును ప్రవహించేలా చూడాలని కమిషనర్ రావిరాల రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎంహెచ్ఓ, ఈఈ, ఏఈ లతో కలిసి పారిశుధ్య పనులను ఎన్ ఎఫ్ సి ఎల్ రోడ్డు, రైల్వే క్రాసింగ్, సూర్యనారాయణపురం ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురుగునీరు ప్రవహించే అవుట్ఫాల్ వద్ద చెత్త ప్లాస్టిక్ వాటర్ బాటిల్ రెండు రోజుల్లో శుభ్రం చేయాలని ఎటువంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పమన్నారు.










