ప్రజాశక్తి- నందిగామ : నందిగామ పట్టణంలో గురుకుల పాఠశాలను నందిగామ 16వ కృష్ణా జిల్లా న్యాయస్థానం జిల్లా జడ్జి వి శ్రీనివాసరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పొందుతున్న వసతులు మౌలిక సదుపాయాలు గురించి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. పట్టుదలతో క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ ర్యాంకులు సాధించి తమ భవిష్యత్తును బంగారు బాటగా వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జూనియర్, న్యాయవాదులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ,వార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు.










