ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ కమిషనర్ రావిరాల రమేష్ ఏర్పాటుచేసిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.సుమారు 30 మంది నుంచి తమ ఫోన్ల ద్వారా తమ సమస్యలను విన్నవించుకున్నారు.సమస్యలను సానుకూలంగా ఉన్న కమిషనర్ రమేష్ సంబంధిత అధికారులకు వెంటనే వాటిని పరిష్కరించల చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్, పారిశుద్ధ్యం వంటి వాటిపై ప్రజలు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ద్వారా సమస్యలను విన్నవించడం జరిగిందని, తక్షణమేటు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇకపై ముందుకు తీసుకువెళ్లడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించడం జరుగుతుందని, ప్రజల సమస్య పరిష్కారమధ్యయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, ఎస్సీ సత్య కుమారి, డిఎంహెచ్ఓ పృధ్వి చరణ్, డితీపిఓ హరిదాసు తదితరులు పాల్గొన్నారు.










