Oct 03,2023 15:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లా సంయుక్త కిసాన్‌ మొర్చా, రైతు, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం విజయనగరంజిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సంయుక్త కిషన్‌ మొర్చా సమన్వయ కమిటీ బి.రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్‌ లు మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక, కార్పోరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలు రద్దు చేసి రైతులకు స్వామినాథన్‌ కమిటీ సిపార్సలకు అనుగుణంగా మద్దతు ధరనిర్ణయించి చట్టం చేసి అమలు కోసం దేశవ్యాప్త రైతు ఉద్యమం జరిగిందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో లకింపూర్‌ కేర్‌ ఘటనలో రైతులు శాంతి యుతంగా నిరశన ర్యాలిపై హౌం శాఖ సహాయక శాఖ మంత్రి కొడుకు ఆశీస్‌ మిశ్రా తన కాన్వారు రైతన్నలను తొక్కించి రైతులపై కాల్పులు జరిపి రైతుల ప్రాణాలను , పాత్రికేయుడు ని బలి తీసుకున్న ఘటనకు బాధ్యుడైన మంత్రి కుమారుడు నీ శిక్షించాలని,కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రిని బర్త్‌ రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలన విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్‌ డే నిర్వహిస్తున్ననందున రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు సామాన్య ప్రజల సమస్త ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ అక్టోబర్‌ 3 న బ్లాక్‌ డే సందర్భంగా ''క్విట్‌ కార్పొరేట్‌- దేశ్‌ కి బచావో'' నిర్వహిచడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులలోని లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ఉదారంగా అందజేస్తూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి ఈ 9 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.16 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్‌ పేరుతో రుణమాఫీ చేసిందన్నారు అలాగే ఉద్దీప పథకాల పేరుతో మరో 10 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రుణాలను ఇచ్చిందన్నారు. వ్యవసాయ సంక్షోభం ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. కార్పొరేట్‌ కంపెనీల రుణాలు మాఫీ చేయడం కాదు.. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నమన్నరు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓడరేవులు, ఎయిర్‌ పోర్టులు, విద్యుత్‌ సంస్థలు, రైల్వే, బొగ్గు గనులు, చివరకు ఆదివాసి, గిరిజనుల అటవీ భూములపై హక్కులను హరిస్తూ తాజాగా అటవీ చట్టానికి సవరణ పాస్‌ చేస్తున్నారన్నారు. ఈ చర్యలన్నీ కార్పొరేట్లకు ప్రత్యేకంగా మోడి మానస పుత్రుడు గౌతమ్‌ అదానీని ముఖేష్‌ అంబానీ ప్రపంచ కుబేరులలో మొదటి స్థానానికి చేర్చేందుకు దోహదము చేస్తు న్నాయన్నారు.సామాన్య ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతూ, కార్పొరేట్లకు ఐ.టి,ఎక్సైజ్‌, కస్టమ్స్‌,కార్పొరేట్‌ టాక్స్‌ ల పైన లక్షలాది కోట్ల రూపాయల రాయితీలను ఇస్తున్నరన్నారు. మరోవైపు కార్మికులు బ్రిటిష్‌ కాలం నుండి పోరాడి 44 కార్మిక చట్టాలను కార్మికుల సాధించుకుంటే ఆ కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్లుగా మార్చి కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా మార్చేందుకు ఈ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఈ ఫలితంగా బలహీన వర్గాల ప్రజల ఉపాధికి నష్టం జరుగుతుందని ,కార్పొరేట్లకు లాభాలు పెంచి ప్రజల సంపదలు లూటీ చేస్తున్న కార్పొరేట్లను తరిమికొట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌.కె.ఎం.జిల్లా కన్వీనర్‌ బి.రాంబాబు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డేగల అప్పలరాజు, రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ రాకోటి రాములు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పురం అప్పారావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ వి.లక్ష్మీ, సిఐటియు నగరఅధ్యక్షులు ఎ.జగన్మోహన్‌, నగర కార్యదర్శి బి.రమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.గోపాల్‌, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్‌.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

2