ప్రజాశక్తి-ఆదోని : ఆదోని పట్టణంలోని పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని నేషనల్ స్కూల్ ఎదురుగా ఉన్న పార్కును, ఎన్‌జిఓఎస్ కాలనీ చిల్డ్రన్స్ పార్కును సందర్శించి అక్కడ సదుపాయాలను పరిశీలించారు. మున్సిపల్ పంప్ హౌస్ పరిసరా ప్రాంతంలోని పెరిగిన మొక్కలు, చెట్ల కొమ్మలను తొలగించామన్నారు. ఎం రామయ్య స్కూల్‌లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయించామన్నారు. విరివిగా మొక్కలు పెంచి పచ్చదనం పెంపొందించి అహ్లాదకరంగా మారుస్తున్నామన్నారు. పట్టణంలోనే మున్సిపల్ పార్కుల్లోని సదుపాయాల కల్పనకు రూ 5 లక్షలు చొప్పున వ్యయం చేస్తున్నామన్నారు. వాకింగ్, జాగింగ్ చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.










