ప్రజాశక్తి - చాపాడు : చాపాడు మండలంలోని ఓబులరెడ్డిపేట గ్రామ పంట పొలాల్లో 2.75 కిలోమీటర్ల మేర రూ.27లక్షలతో వేయనున్నా గ్రావెల్ రోడ్డు కు ఎంఎల్ఏ ఎస్ రఘురామిరెడ్డి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలలో గ్రావెల్ రోడ్డులు నిర్మాణానికి రూ. 22 కోట్లు సీఎం మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆర్ అండ్ బి రోడ్లు, ఆయకట్టు రోడ్లు పూర్తిగా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఎస్ నాగిరెడ్డి, ఎంపిపి టి లక్షుమయ్య, సింగిల్ విండో చైర్మన్ పాలగిరి వేమారెడ్డి, పెద్దగురువలూరు సర్పంచ్ రాజేష్ రెడ్డి, వైసిపి నాయకులు ఓబుళరెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.










