Dec 31,2022 14:39

ప్రజాశక్తి-రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు నత్త నడతన సాగుతుందని, కాబట్టి అధికారులు చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దారు పాల్ కు శనివారం నాడు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు ఎం మాధవరెడ్డి మాట్లాడుతూ మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ ఆలస్యంగా జరుగుతుందని, రైతులు ప్రశ్నిస్తే గోన సంచులు లేవంటూ, లారీలు రావటం లేదంటూ సాకులు చెబుతున్నారని దీనివలన రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. పైన వాతావరణం చూస్తే అనకుకూలంగా ఉన్నదని ఈ పరిస్థితుల్లో అకాల వర్షం పడితే రైతులకు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉండదని కనుక అధికారులు స్పందించి గోనెసంచులు సరఫరా చేయటంతో పాటు, లారీ సప్లై కూడాను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బొల్లారెడ్డి మోహన్ రెడ్డి, అధ్యక్షులు గోగులమూడి అప్పిరెడ్డి, రైతు సంఘం నాయకులు ఉయ్యూరు కృష్ణారెడ్డి, రైతు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.