Apr 22,2023 15:50
  • మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామి విమర్శ 

ప్రజాశక్తి -నందిగామ : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్న సుబాబుల పంటకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. శనివారం నందిగామ మండలం హనుమంతపురం గ్రామంలో  సుబాబుల్ పంటను ఆమె పరిశీలించారు. సుబాబుల్ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదని సుబాబులు పొలంలో నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత  టిడిపి ప్రభుత్వ హయాంలో సుబాబుల్ రైతులకు టన్నుకు 4000 నుండి 4200 మధ్యలో ధర ఉండేదని, కానీ సుబాబుల్ రైతుల మీద దొంగ ప్రేమ ఒలకబోస్తూ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే  మొండితోక జగన్ మోహన్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  మద్దతు ధర 5000 ఇస్తామని ఆనాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో గాంధీ సెంటర్ లో హామీ ఇప్పించి ఓట్లు వేయించుకున్నారు మరి ఆ హామీ ఇపుడు ఏమైందని ప్రశ్నించారు. ఇవాళ సుబాబుల్ టన్ను ధర 1200 నుండి 1600 లేదని, ఇదేనా రైతన్న మీద  వైసిపి ప్రభుత్వం అనుకున్న  విశ్వసనీత అని ప్రశ్నించారు. తక్షణమే సుబాబుల్ పంటకు కనీస గిట్టుబాటు ధర 5000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో టిడిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుందని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.