
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలను ఢిల్లీ పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఆయనపై ఆరుగురు మహిళలు ఫిర్యాదు చేయగా, నలుగురి ఫిర్యాదుల్లో ఫొటో సాక్ష్యాలు, ముగ్గురి ఫిర్యాదుల్లో వీడియో సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుల్లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన 1,500 పేజీల చార్జిషీటులో ఈ ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా 200 మందికిపైగా సాక్షుల స్టేట్‌మెంట్లను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు. బాధితుల ఆరోపణలకు బలం చేకూర్చే స్టేట్‌మెంట్లను చార్జిషీటులో పొందుపరచి, కోర్టుకు సమర్పించారు. 100 స్టేట్‌మెంట్లు ఈ ఆరోపణలకు బలం చేకూర్చేవిగా ఉనాుయనిపోలీసులు గుర్తించారు. ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డులు వంటి టెకిుకల్ ఎవిడెన్స్ (సాంకేతిక ఆధారాలు)ను కూడా కోర్టుకు సమర్పించారు. దీనిపై కోర్టు విచారణ ఈ నెల 22న జరగనుంది.
డబ్ల్యుఎఫ్‌ఐ కార్యాలయం, టోరుమెంట్లు, క్యాంపులు, ఇతర కార్యక్రమాలు జరిగేటప్పుడు తమపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించారనిఢిల్లీ పోలీసులు తెలిపారు. పతకాలు పొందిన సందర్భంగా జరిగిన కార్యక్రమాలు, గ్రూప్ ఫొటోలు తీసుకును సందర్భాల్లో తీయించుకున్న ఫొటోలు, వీడియోలను ఫిర్యాదుదారులు సమర్పించారని పేర్కొనాురు. ప్రత్యక్ష సాక్షుల కథనాలు, టోరుమెంట్ రిఫరీలు, సిబ్బంది, కో-పార్టిసిపెంట్ల స్టేట్‌మెంట్లను కూడా చార్జిషీటులో పొందుపరచినట్లు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను అందజేయాలని కోరుతూ ఐదు దేశాల రెజ్లింగ్ ఫెడరేషన్లకు ఢిల్లీ పోలీసులు లేఖలు రాశారు. ఆ దేశాలు స్పందించి, ఆధారాలను సమర్పిస్తే, బ్రిజ్ భూషణ్‌పై అనుబంధ చార్జిషీటును దాఖలు చేస్తారు.
రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలి
ఢిల్లీలోనిజంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు నిరసన తెలుపుతును సమయంలో మే 28న జరిగిన ఘర్షణకుసంబంధించిన కేసులో రెజ్లర్లకువ్యతిరేకంగా నమోదైన కేసును రద్దు చేయాలనికోరుతూ కోర్టును ఆశ్రయిస్తారు.