Jul 09,2023 22:15

న్యూఢిల్లీ : పెప్సికో కంపెనీ తయారుచేసే లే పొటాటో చిప్స్‌ కోసం ప్రత్యేకంగా బంగాళాదుంపల వెరైటీ మొక్కలను పెంచేందుకు గల పేటెంట్‌ను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై కంపెనీ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. పెప్సికో కోసం ప్రత్యేకంగా పెంచే ఎఫ్‌సి5 వెరైటీకి మంజూరు చేసిన మేథో సంపత్తి పరిరక్షణ హక్కులను 2021లో పిపివిఎఫ్‌ఆర్‌ (మొక్కల వెరైటీలు, రైతుల హక్కుల పరిరక్షణ) సంస్థ రద్దు చేసింది. విత్తన రకాలపై పేటెంట్‌ను భారతీయ నిబంధనలు అనుమతించడం లేదని పేర్కొంది. విత్తన రకంపై కంపెనీ పేటెంట్‌ను క్లెయిమ్‌ చేయలేదంటూ రైతు హక్కుల కార్యకర్త కవితా కురుగంటి వాదించడంతో ఆ సంస్థ పెప్సికో పేటెంట్‌ను తొలగించింది. దీనిపై పెప్సికో కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ అప్పీల్‌ను కొట్టివేస్తూ ఈ నెల 5న న్యాయమూర్తి నవీన్‌చావ్లా ఆదేశాలు జారీ చేశారు.