- మిరప, వరి, అరటి, పంటలపై తీవ్ర ప్రభావం
- మరో 48 గంటలు అప్రమత్తం : కలెక్టర్లు
- చీకటిలో మగ్గుతున్న గుత్తివారిపల్లి
ప్రజాశక్తి - యంత్రాంగం : మాండూస్ తుపాను నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భార్షీ వర్షాలు పడ్డాయి. మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి, చిత్తూరు కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. సురేంద్రనగరం, డిఎంపురం, కెఎం పురం, కొటార్వేడు, గోపిశెట్టిపల్లి, లక్ష్మీరాజపేట పంచాయతీల్లో తీవ్రత అధికంగా ఉండడంతో మిరప, వేరుశనగ పంటలు నీటమునిగాయి. యర్రమరాజుపల్లి, గాజంకి, కెపి అగ్రహారం, జాండ్లపేట గ్రామాల్లో తుపాను దాటికి వేరుశనగ పంట నీట మునిగింది. తుమ్మలచెరువు కాల్వ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. రామకుప్పం మండల పరిధిలోని మణింద్రం పంచాయతీ అత్తికుప్పం గ్రామంలో ఓ ఇల్లు నేలకూలింది. జిల్లాలో ఇప్పటివరకు ఏడు పశవులు, తొమ్మిది దూడలు, 13 గొర్రెలు చనిపోయాయని, 159 గృహాలు దెబ్బతిన్నాయని తిరుపతి కలెక్టర్ తెలిపారు. చిల్లకూరు మండల పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాల్లో వరి నారుమళ్లు నీట మునిగాయని వ్యవసాయ అధికారి భవాని చెప్పారు. రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లి పంచాయతీలోని గుత్తివారిపల్లి గ్రామానికి, ఎస్‌సి, ఎస్‌టి కాలనీలకు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కరెంట్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నారు. కరెంట్ సౌకర్యం పునరుద్ధరించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లాలో కందుకూరు, ఉదయగిరి, వరికుంటపాడు ప్రాంతాల్లో శనగ, పొగాకు, పెసర పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సుమారు ఐదు వేల ఎకరాల్లో వరి నారుమళ్లు దెబ్బతినుట్లు అధికారులు పేర్కొనాురు. ఇందుకూరుపేట, టిపిగూడూరు మండలాల్లో అరటి తోటలు దెబ్బతినాుయి. కోవూరు, సంగం, బుచ్చిరెడ్డిపాళెం, విడవలూరు, మండలాల్లో రొయ్యలు, చేపల చెరువుల్లో నీరు చేరింది. కడప జిల్లాలోని20 మండలాల్లోని134 గ్రామాల్లో 28,592.5 ఎకరాల్లో పంటలు దెబ్బతినాుయి. వీటిలో వరి పంట కోత దశలోనూ, బుడ్డశనగ పూత దశలో, జను పూత, పిందెదశలో, మినుములు కోతదశలో ఉండడంతో దిగుబడులపై ప్రభావం చూపించే అవకాశం ఉందనిపలువురు రైతులు తెలిపారు. లింగాల, బి.మఠం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, చెనూురు, ఒంటిమిట్ట, కడప, చాపాడు, మైదుకూరు, సిద్ధవటం, గోపవరం మండలాల్లోని242 మంది రైతులకుసంబంధించిన 408.5 ఎకరాల పండ్లతోటలు నేల కొరిగాయి. రూ.30.44 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
- రైతు ఆత్మహత్యాయత్నం
తుపానుతో వరి పంట మొత్తం దెబ్బతినడంతో అప్పులెలా తీర్చాలో తెలియక ఓ రైతు ఆత్మహత్యాయతాునికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వాసేపల్లిపాడు గ్రామానికి చెందిన దూడల వెంకట్రావు తన మూడెకరాల పొలంతో పాటు మరో పది ఎకరాలు కౌలుకుతీసుకునివరి పంట సాగు చేశారు. సాగు నిమిత్తం రూ.15 లక్షలు అప్పు చేశారు. మూడు రోజులుగా కురుస్తోను వర్షాలతో పంట మొత్తం నీటితో నిండిపోయింది. నేలవాలడంతో పంట మొత్తం నాశనమైంది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరే దారిలేక పురుగు మందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.










