May 04,2023 16:08

ప్రజాశక్తి-కాకినాడ : నిబంధనల సడలించి ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా రైతు, కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కాకినాడ జిల్లాలో ధాన్యం రాసులు, వరి పొలాలు వర్షం నీటితో మునిగాయి. ధాన్యం రాశులు మొలకెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురైన పరిస్థితుల్ని కాకినాడ జిల్లా రైతు, కౌలు రైతు సంఘం  నాయకులు స్వయంగా పరిశీలించచారు. నిబంధనలను సడలించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.నాగేశ్వరరావు, కౌలు రైతు ఎం. రాజశేఖర్ సెక్రటరీ వి.రాజబాబు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వరి పొలాలను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రమైన కరప గ్రామంలో  పొలాలలోని ధాన్యం ఆరబెడుతున్న  రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.