ప్రజాశక్తి-విజయవాడ : నూతన సంవత్సరం సంబరాలు సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో 8 టీములు పాల్గొన్నవి. ఈ పోటీలను పౌర సంక్షేమ సంఘాల రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ క్రీడలు ఐక్యతకు సంకేతమని అన్నారు. దేహదారుడ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనం క్రీడలు అన్నారు. క్రీడాకారులు క్రీడలను అభ్యసించుట కొరకు తగినన్ని మైదానాలు లేక ఖాళీ స్థలాలలో ఊరికి చివర పొలమేరలు ఉన్న కాలువ గట్ల పక్కన ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని అన్నారు. విద్యార్థులు, యువత, చెడు మార్గాలు అభ్యసించకుండా ఉండాలంటే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నదని అన్నారు. క్రీడలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన యువత గంజాయి స్టెరాయిడ్స్ తదితర మత్తు పదార్థాలకు లోనవుతున్నారని దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ప్రాథమిక విద్య నుండే ప్రాథమిక పాఠశాలలోనే క్రీడలకు ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తే విద్యార్థుల యువత దృష్టి క్రీడలపైనే ఉంటుందని తద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని ఇలాంటి చర్యలు తక్షణమే ప్రభుత్వాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితుల్లో డివైఎఫ్ఐ ప్రజా సంఘాలు నూతన సంవత్సరం పండుగల సందర్భాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించటం చాలా సంతోషదాయకమని సంఘాలకు అభినందించారు. క్రీడలలో నైపుణ్యం సంపాదించుకుంటూ సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ఆధ్యయనం చేయాలని చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉంటూ మంచి సమాజాన్ని నెలకొల్పాలని క్రీడాకారులకు విద్యార్థులకు యువతకు విజ్ఞప్తి చేశారు. రాబోయే సంక్రాంతి సందర్భంగా ఈ సంఘం ఇతర అన్ని ప్రజా సంఘాలు స్పోర్ట్స్ కమిటీలు నిర్వహణ కమిటీలు సంయుక్తంగా వివిధ రకాల ఆటలు మరియు కళారూపాలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈరోజు పాల్గొన్న టీంలు దుర్గాపురం క్యాపిటల్స్ కెప్టెన్ ఈశ్వర్, ఎవెంజర్ టీం కెప్టెన్ సూర్య, సీన్స్ టీం కెప్టెన్ సతీష్ వారి టీం సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. పోటీల నిర్వహణ కమిటీ డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు శివలింగేశ్వరరావు, ఎస్.కె నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.










