ప్రజాశక్తి-ఏలేశ్వరం: మండలంలోని తిరుమాలి గ్రామానికి చెందిన భూదాన భూమి లబ్ధిదారులకు పట్టదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని తాసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ నాయకుడు కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ తిరుమల గ్రామంలోని సర్వేనెంబర్ 79 లో 2 ఎకరాల14 సెంట్లు, సర్వేనెంబర్ 80లో 9 ఎకరాల 19 సెంట్లు భూమిని 1955 లో భూస్వాములు భూదాన బోర్డుకు ఇవ్వడం జరిగిందన్నారు. సదరు భూమిని భూమిలేని 44 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ భూమిని రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించి పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి లక్ష్మి తారేపల్లి అజ్జమ్మ, రాజ్యాల సత్తిబాబు, పోతాడ నల్ల బాబు సుందరపల్లి అప్పలరాజు, బొండాడ పార్వతి, బత్తుల జయమ్మ, బొల్లం చిట్టెమ్మ ఉన్నారు.










