ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : క్రిష్ణగిరి మండలంలోని మొత్తం 36 గ్రామాలు లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కారం కోసం ప్రజలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం నాయకులు జె.నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ఈనెల 26 నుండి 31వ తేదీ వరకు కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికై ఆదోని నుండి కర్నూలు వరకు జరుగు సిపిఎం పాదయాత్ర క్రిష్ణగిరి మండలంలో గ్రామ సమస్యల పరిష్కారం కోసం సచివాలయాల వద్ద నిరసనలు చేయాలని, 18 వ తేదీన జీపుజాత వస్తుందనిపై కార్యక్రమాలు అన్నింటిలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని క్రిష్ణగిరి మండలకమిటీ పిలుపునిచ్చింది. ప్రధానంగా బస్సు సౌకర్యం జూనియర్ కళాశాల ను నిర్మించి డ్రాప్ అవుట్లను తగ్గించి మండలంలో అక్షరాస్యత పెంచాలని అందుకు నాడు నేడు కింద కోటి రూపాయలు ఖర్చు చేస్తుంది అన్నారు. రోడ్లు బ్రిడ్జిలు ఏర్పాటు చేసి గ్రామాల నుండి మండలానికి రోడ్డు రవాణా సౌకర్యం పెంపొందించాలన్నారు. క్రిష్ణగిరి మండలంలోని గ్రామాల్లో త్రాగునీరు, సాగునీరు అందించాలని కోరారు. ఆధారంపై ఆధారపడి ఉన్నాయి ఈ గ్రామాల్లో చెరువులకు నీళ్లు మరణించి సాగునీరు అందేటట్లు చేసి పంటలు పండించి సస్యశ్యామలం చేసేందుకు కృషి చేయాలి. మండలంలో పంటలు పండించి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే అన్ని గ్రామాల్లో ఇంటి స్థలాలు మరుగుదొడ్లు సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.










