Jun 17,2023 15:51
  • గూడూరు నుండి కోడుమూరు వరకు రోడ్లు వేయండి :  సిపిఎం

ప్రజాశక్తి-గూడూర్ : మండల పరిధిలోని గూడూరు చనగండ్ల మీదుగా కోడుమూరు వరకు ఉన్న రహదారిని వెంటనే వేయాలని శనివారం నాడు చనగుండ్ల గ్రామంలో గడప గడప కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ని సిపిఎం నాయకులు రోడ్డుపై బటాయించి గడప గడప కార్యక్రమం అడ్డుకున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జయ మోహన్ కట్లయ్య మాధవ కృష్ణ పాల్గొని వీరులు మాట్లాడుతూ గూడూరు నుండి చనగుండ్ల మీదుగా కోడుమూరు వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయంగా అయిందన్నారు. దాదాపు 15 సంవత్సరాలు అయిన ఈ రోడ్డు నిర్మాణం పనులు అధికారులు గానీ పాలకులు గాని చేపట్టడం లేదన్నారు. చనుగుండ్ల గ్రామంలో గర్భిణీలు బాలింతలు పేషెంట్లు ప్రజలు ఈ రోడ్డు మార్గంలో హాస్పిటల్కు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ రోడ్డు మార్గంగా వెళ్లి హాస్పిటల్లో చేరేలోపు ప్రాణాపాయం స్థితి ఏర్పడి వచ్చానే రెండు మండలాలను కలిపి ఈ రహదారిని పాలకులు అధికారులు చూసుకుంటూ వెళ్లినా కూడా ప్రభుత్వాలు మారినా అధికారులు మారిన ఈ రోడ్డు మాత్రం బాగుపడే లక్షణాలు లేవన్నారు. ఈ రహదారిని ఎప్పుడు బాగు చేస్తారని ఎమ్మెల్యే సుధాకర్ బాబును ప్రశ్నించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ రోడ్డు శాంక్షన్ అయిందని టెండర్లు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేసి రోడ్డు నిర్మాణం పనులు చేపడతానని హామీ ఇవ్వడంతో సిపిఎం నాయకులు ధర్నాను విమరిమించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామాంజనేయులు, సుధాకర్, వెంకటేశ్వర్లు, మల్లేష్, రమేష్, మహేంద్ర భరత్, శివ, సుధాకర్, మహేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.