Oct 09,2023 16:39

ప్రజాశక్తి-పెనుకొండ : చర్చల పేరుతో పిలిచి అవమానం చేస్తారా అంటూ ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ కారుకు సిపిఎం నాయకులు, ఇళ్లు లేని పేదలు అడ్డుపడిన సంఘటన సోమవారం పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. ఇళ్లు లేని నిరుపేదలు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కారు ముందుకు కదలకుండా అడ్డంగా  కూర్చోవడం జరిగింది.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్ మాట్లాడుతూ చిలమత్తూరు గ్రామానికి చెందిన ఇళ్ళు లేని నిరుపేదలు 260 మందిని అధికారులే గుర్తించారన్నారు. అనంతరం నవరత్నాలు - పేదలందరికి ఇళ్ళు - 90 రోజులు పథకం కింద మరో  300 మంది దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు. అధికారులు అనేక మోసపూరిత హామీలు ఇవ్వడం, సకాలంలో అధికారులు స్థలాలు చూపించక పోవడంతో సిపిఎం నాయకత్వనా పేదలు ప్రభుత్వ స్థలాన్ని గుర్తుంచి గుడిసెలు వేసుకున్నారున్నారు. పేదలు వేసుకున్న గుడిసెలను ఉన్న ఫలంగా రెవిన్యూ అధికారులు తొలగించి విలువైన పత్రాలను కాల్చి ఒక్కొక్కరికి  20 వేలు నష్టం చేశారని తెలిపారు. ఈ విషయమై  పరిష్కారం కోసం సోమవారం జాయింట్ మీటింగ్ కు ఆహ్వానించి పేదలు, సిపిఎం నాయకులతో  మాట్లాడకుండా క్యాంపు పేరుతో వెళ్ళడానికి అధికారులు ప్రయత్నించారని దీంతో విషయం తెలుసుకున్న పేదలు జాయింట్ కలెక్టర్ కారును అడ్డుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా మా స్థలాలు మాకు ఇవ్వాలి, మా గుడిసెలు తొలగించిన అధికారులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ తప్పకుండా నెల రోజుల్లో ఇళ్ళ పట్టాలు ఇస్తామని, పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాన్ని ఇళ్ళ స్థలాల కోసం పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా కారు అడ్డంగా కూర్చొన్న పేదలు పైకి లేచారు. ఈ కార్యక్రమంలో చిలమత్తూరు సిపిఎం స్థానిక నాయకులు వెంకటేశులు, లక్ష్మీనారాయణ, పెనుకొండ సిపిఎం పార్టీ నాయకులు రమేష్ , సిఐటియు మండల కార్యదర్శి బాబావలి మరియు పేదలు  పాల్గొన్నారు.