ప్రజాశక్తి-నెల్లూరు : పెంచిన విద్యుత్ బిల్లులపై కరెంట్ ఆఫీస్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ అనంతరం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ షరతులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంచి వసూలు చేయడం దారుణమని తక్షణమే పెంచిన చార్జీలను తగ్గించాలని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రైతుసంఘం జిల్లా కార్యదర్శి మూలివెంగయ్య ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో మేము అధికారులకు వచ్చిన వెంటనే ప్రజలపై విద్యుత్ వారాలు తగ్గిస్తామని ఆర్భాటంగా హామీలు చేశారన్నారు. కేంద్రంలోని బిజెపి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు బస్సు చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారాలు మోపడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య, పేడూరు శాఖ కార్యదర్శి ఈపూరు లక్ష్మయ్య, ఆటో యూనియన్ అధ్యక్షులు నాశిన పరశురామయ్య మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి వెంకట శేషయ్య, అన్నం పుట్టయ్య డివైఎఫ్ఐ నాయకులు మున్నా రైతులు రమణమ్మ తాతయ్య, వెంకటసుబ్బయ్య రాధయ్య ఆటో యూనియన్ కమిటి సభ్యులు శివ , దయాకర్,వెంకట శేషయ్య, గోపి, భాస్కర్, గణేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.










