Jun 10,2023 15:44
  • పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి. సిపిఎం డిమాండ్.

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ట్రూ ఆప్ సర్దుబాటు ఎఫ్ పి పి సి ఏ ఇలా రకరకాల పేర్లతో జనాన్ని బాదేస్తున్న వైసీపీ సర్కార్ ఏనాడో వాడుకున్న కరెంటు కి ఆనాడే బిల్లు కట్టేసిన విద్యుత్ సంస్థలు లెక్కలు వేసుకొని మీరు చెల్లించిన బిల్లులో చాలా లేదని నేపంతో జగన్ ప్రభుత్వం ప్రజల పైన మోయలేని భారాలు వేస్తా ఉందని మోలిగే నక్క పైన తాటికాయ పడ్డ చందంగా వ్యవహరిస్తా ఉందని సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ ధ్వజమెత్తారు. శనివారం పాతబస్తీలోని పూల బజార్ నందు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు డి. అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం .రాజశేఖర్ కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు  ఇంటి పన్ను కులాయి పన్ను తో పాటు చెత్త పన్ను కూడా కట్టించుకుంటున్న చెత్త ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని మరి అదే విధంగా నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి ప్రజల నడ్డి విరగొడుతున్న వైసిపి సర్కార్ కి ఇది చాల దనీ మళ్ళీ యూనిట్ కి 40 పైసలు చొప్పున కరెంట్ చార్జీలు పెంచడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి అడుగులకు మడుగులు వేస్తూ తాన అంటే తందానా అంటూ వైసీపీ సర్కార్ వ్యవహారం ఉందనీ నిప్పులు చెరిగారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనటువంటి ఈవెన్ బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలతో పోల్చుకున్నప్పుడు నరేంద్ర మోడీ యొక్క మాటను జవ దాటకుండా పాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన జగనన్న ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ప్రజలకు వెన్నంటి ఉండి ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం ప్రజల పైన మోయలేని భారాలు వేస్తా ఉందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం ప్రజల పైన చిత్తశుద్ధి ఉన్న వైసిపి సర్కార్ తక్షణమే కరెంట్ చార్జీలను ఉపసంహరించుకోవాలని సర్దుబాటు పేరుతో వసూల్ చేసిన బిల్లులను వెనక్కి తీసుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నామని తెలియజేశారు. లేనిపక్షంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి ప్రజా ఆగ్రహానికి లోనై 22 నుండి 2014 వరకు రాజకీయంగా సమాధి అయిందన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం మర్చిపోకూడదని ప్రజలందరూ ఉవ్వెత్తున పోరాడి చివరకు ముగ్గురు పురాణాలను బలిదానం చేసి విద్యుత్ చార్జీలను పెంచకుండా నివారించిన ఘనత పోరాటాలకు ఉందని అటువంటి ప్రజా పోరాటాలకు వైసీపీ సర్కార్ మాడి మసైఅయి తారని ఆయన హెచ్చరించారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కె.వి. సుబ్బయ్య, రవికుమార్, ఘోర రఫీక్, అబ్దుల్ రహమాన్, ఈశ్వర్, మాదన్న, జయమ్మ, ఇంతియాజ్, జయరాం, గిడ్డయ్య ,షకీల్,  ఖాదర్
తదితరులు పాల్గొన్నారు.