Jun 09,2023 16:09

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్దుబాటు పేరుతో పెంచిన కరెంటు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ భవనం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌస్ దేశాయ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకొస్తే కరెంటు చార్జీలు పెంచను అని చెప్పిన వ్యక్తి, "మాట తప్పను మడమ తిప్పను" అని ప్రజలను మోసగించిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టాడని ఆయన ఘాటుగా విమర్శించారు. కరెంట్ చార్జీలను చూస్తే అసలు కంటే కొసరే ఎక్కువ ఉన్నదని ఆయన యద్ధమే చేశారు. ఇంధన సర్దుబాటు చార్జి పేరుతో ప్రతి సంవత్సరం కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. ఒక వినియోగదారుడు కాల్చిన యూనిట్ చార్జీలు 125 రూపాయలు అయితే కష్టం చార్జీలు, మూడు సర్దుబాటు చార్జీలు కలిపి  395 రూపాయలు అవుతుందని మొత్తం బిల్లు 519 రూపాయలు అని, కాల్చిన కరెంటు రేటు కంటే ప్రభుత్వం అదనంగా వేసే భారాలే మోయలేనంతగా ఉన్నదని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు త్రిబుల్ షాక్ ఇచ్చిందని ఆయన విమర్శించారు. గతంలో ఉన్న రెండు సర్దుబాటు చార్జీలకు అదనంగా మరో సర్దుబాటు చార్జీలు కలిపి జూన్ నెలలో బిల్లు వేశారని, బిల్లు చూసినా వినియోగదారుడు కరెంట్ షాక్కు ద్వారా కాకుండా బిల్లు చూసి షాక్ కు గురయ్యాడని ఆయన తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2022లో తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండా మోడీ చెప్పిన విధానాన్ని అమలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా కరెంటు చార్జీలు పెంచడానికి సుముఖత వ్యక్తం చేయని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి కరెంటు చార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తున్నాడని, ఇదే కాకుండా భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, పట్టణాల్లో చెత్త పన్ను, ఇంటి పన్ను, కొళాయి పన్ను పెంచి ప్రజలపై భారాలు వేయడమే పనిగా పెట్టుకున్నాడని ఈయన పద్ధతులు ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బిఎస్ రాధాకృష్ణ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాధనప్పడానికి ఎదురుచూస్తున్నారని వారు విమర్శించారు చంద్రబాబు నాయుడు తరలించినప్పుడు బాదుడే బాధుడని రంగులేసిన పెద్దమనిషి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతూ వెనకవైపు నుండి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టాడని వారు విమర్శించారు ప్రభుత్వం తాను పెంచిన యూనిట్ చార్జీలను ఉపసంహరించకపోతే రాబోయే కాలంలో ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అంజిబాబు, సుధాకరప్ప,షరీఫ్,అబ్దుల్లా విజయ్, నర్సింలు, రఫిక్, మహిళా సంఘం నాయకురాలు కేఎస్ పద్మ, పద్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు.