Jun 22,2023 16:16

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : మండలం పరిధిలో పాండవుగల్లు గ్రామ పాతూరు ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ఆదోని, కోసిగి, కౌతాళం, పెద్దకడుబురు మండలాల సిపిఎం కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు రెండో రోజు పార్టీ సీనియర్ నాయకులు మల్లయ్య అధ్యక్షతన జరిగాయి. ఈ శిక్షణ తరగతుల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు, పిఎస్ రాధాకృష్ణలు మాట్లాడుతూ సాగునీరు, త్రాగునీరు, విద్యా, వైద్యం ఉపాధి వలసలు సమస్యలు పరిష్కరించాలని,జిల్లా సమగ్ర అభివృద్ధి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జూలైలో జరిగే పాదయాత్రలు జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరుగాంచిందని ఈ ప్రాంతంలో ఇప్పటికీ 22% పేదరికం ఉందని అనేక నివేదికలు తెలియజేశాయని, ఈ వెనుకబాటు ధనానికి కారణం పాలక ప్రభుత్వాలేనని అన్నారు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు లేక సాగునీరు లేక రైతాంగం కేవలం వర్షాలపై ఆధారపడి పంటలు పండించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పశ్చిమ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని, 2019లో మంజూరైన ఆర్డీఎస్, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం వైసిపి ప్రభుత్వం హయంలో నేటికీ చేపట్టకపోవడం దారుణమని వారు విమర్శించారు. తుంగభద్రా నది ద్వారా సుమారు 50 టీఎంసీలకు పైగా నీరు ప్రతి ఏటా సముద్రం పాలు  అవుతుందని ఈ నీటిని నిల్వ చేసుకొని రైతులకు సాగునీరు అందించడంలో గత టిడిపి ప్రభుత్వం కాంగ్రెస్ మరియు వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. అలాగే విద్యా వైద్య రంగాలలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతుందని, ఈ ప్రాంతంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఇక్కడ సాగునీరు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు లక్షలాదిమంది వేరే ప్రాంతాలకు ప్రతి ఏటా వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టాలని విద్య వైద్య తరంగాలలో మార్పు తీసుకురావాలని చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వలసల నివారణ చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో జూలై నెలలో పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఆదోని మండల కార్యదర్శి కే లింగన్న, సిపిఎం పార్టీ పెద్దకడూరు మండల కార్యదర్శి ఈ తిక్కన్న, సిపిఎం కోసిగి మండల కన్వీనర్ కే రాముడు, సిపిఎం పార్టీ కౌతాళం మండలం కన్వీనర్ ఎం ఈరన్న నాలుగు మండలాల నుండి సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.