
ప్రజాశక్తి-మంగళగిరి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు చార్జీల బాదుడితో సామాన్యుల నడ్డి విరుస్తున్న విద్యుత్ బిల్లులు చూడగానే ప్రజలకు షాక్ కొడుతుందని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చేంగయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపిన విద్యుత్ చార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలైనటువంటి (సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్,) ఆధ్వర్యంలో మంగళగిరి మిద్దె సెంటర్లో శనివారం ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చెంగయ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీల పేరుతో సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు.మిద్దె సెంటర్లో రెండు గంటల పాటు నిర్వహించిన కరెంటు చార్జీల పెంపుదలపై ప్రజా బ్యాలెట్ లో 210 ఓట్లు పోలవగా 209 ఓట్లు కరెంట్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా వచ్చాయి. ఒక్క ఓటు మాత్రం కరెంట్ చార్జీల పెంపుదలకు అనుకూలంగా వచ్చిందని అన్నారు.ఎన్నికల ముందు బహిరంగ సభల్లో 500 ,600, కరెంటు బిల్లు వస్తేనే సామాన్య ప్రజలు ఎలా కడతారు అని అడిగిన ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత సర్దుబాటు చార్జీలు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపుతూ విద్యుత్ రంగాన్ని ఆదాని తదితర బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబట్టేందుకు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అదానీలాంటి కార్పొరేటర్లకు తాకట్టు పెడుతూ ప్రజలపై పెనుబారాల మోపుతున్నారని అందుకే మన జేబులు ఖాళీ చేస్తూ విద్యుత్ చార్జీలు పెంచుతూ బడా కార్పొరేటర్ కంపెనీలతో కుమ్మక్కై విద్యుత్ని బహిరంగ మార్కెట్లో 10 నుండి 20 రూపాయల కొంటున్నారని మండి పడ్డారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు లోపు విద్యుత్ వాడే వారందరికీ ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినా జగన్ మోసం చేస్తున్నారని ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ క్రమంగా నీరు కారుస్తున్నారని చిరు వ్యాపారులకు విపరీతమైన రేట్లు పెంచారని వ్యాపార సంస్థలు పరిశ్రమలపై భారం పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ, జగన్ కలిసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విద్యుత్ చార్జీల పెంపును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, అన్నవరపు ప్రభాకర్, నందం బ్రహ్మేశ్వర రావు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, జాలాది జాన్ బాబు, జవ్వాది సాంబశివరావు, గుంటక సాంబిరెడ్డి, చిన్ని సత్యనారాయణ, ఎస్కే కరీముల్లా, బుర్ల శ్రీనివాసరావు, యార్లగడ్డ శివ గోపి, మత్తే అభిషేక్, ఆళ్ళమూడి హనోక్ బాబు, సిపిఎం సీనియర్ నాయకులు జె వి రాఘవులు, పిల్లలమరి బాలకృష్ణ ,ఎం ఫకీరయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్, పట్టణ నాయకులు ఎం బాలాజీ, ఎం చలపతిరావు, డి రామారావు, సిపిఐ ఎంఎల్ నాయకులు కే కోటేశ్వరరావు, ఆదినారాయణ, దుర్గాప్రసాద్, అంజిరెడ్డి, భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.