Mar 29,2023 16:56

ప్రజాశక్తి-మైలవరం : సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ఆంజనేయులు మాతృమూర్తి సిరిదేవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గంపలగూడెం మండలం కనుమూరు గ్రామంలో వారి స్వగృహం వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా కార్యదర్శి డివి కృష్ణలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.