Jun 19,2023 15:52

ప్రజాశక్తి-గూడూరు : సామాన్య ప్రజల నడ్డి పిరుస్తూ బిల్లులతో జనానికి షాక్ ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీల పెంపుదలను ప్రతిఘటించాలని సోమవారం నాడు సిపిఎం మండల కార్యదర్శి జే మోహన్ పట్టణ కార్యదర్శి రాజశేఖర్ పిలుపునిచ్చారు. వీరులు మాట్లాడుతూ వేసవికాలం మండిపోతు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే ఈనెల విద్యుత్ బిల్లులు చూడగానే ప్రజలకు కరెంట్ షాక్ కొట్టినట్లు ఉందని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలకు షాక్ ఇస్తూ ఒకేసారి సర్దుబాటు చార్జీల పేరుతో మూడు పోట్లు పొడిచిందని కరెంట్ కు బిల్లులే కాకుండా ఫిక్స్ చార్జీలు కస్టమర్ చార్జీలు సర్ చార్జీలు విద్యుత్ సుంకం సర్దుబాటు చార్జీలు ఇలా రకరకాల పేర్లు పెట్టి జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయన్నారు. అసలు కరెంట్ చార్జీల కంటే కొసూరు చార్జీలు అధికమయ్యాయని దొడ్డి దారిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచి మూయలేని భారాలను వేస్తున్నాయన్నారు. కావున సర్దుబాటు చార్జీలు విధానం రద్దు చేయాలని ట్రూ ఆఫ్ చార్జీల వసూలు నిలిపివేయాలని లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జరుగు పోరాటాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దానమన్న, రాజు, మునియప్ప, సిఐటియు నాయకులు అబ్రహం, చిన్న, హమాలీలు రవి, చిన్న, మధు, తదితరులు కార్మికుల పాల్గొన్నారు.