- వేరుశనగ,మిరప పంటలను పరిశీలించిన జిల్లా కార్యదర్శి రాంభూపాల్
ప్రజాశక్తి-ఉరవకొండ : తీవ్రవర్షభావ పరిస్థితుల్లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు.బుధవారం సిపిఎం ఉరవకొండ మండల కన్వీనర్ మధుసూదన్ తో కలిసి జిల్లా కార్యదర్శి రాంభూపాల్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రంగారెడ్డి,బాల రంగయ్య,రైతు సంఘం జిల్లా నాయకులు జ్ఞానమూర్తిలతో కలిసి మండల పరిధిలోని భూదగవి గ్రామంలో వేరుశనగను విడపనకల్ మండల పరిధిలోని ఉండబండ గ్రామంలో మిరప పంట పోలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుధగవి గ్రామానికి చెందిన వన్నూరు స్వామి తన రెండున్నర ఎకరాల సొంత పొలంతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ పంట సాగు చేశారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన తిప్పేస్వామి మూడు ఎకరాలలో వేరుశనగ పంట సాగు చేసిన రైతులతో పంట పొలాలలో జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పట్టించుకునే నాధుడే లేరన్నారు పొన్నూరు స్వామి అనే రైతు హైదరాబాదులో అయ్యప్ప ఇన్ఫ్రా స్ట్రక్చర్ అనే కంపెనీలో ఉద్యోగం చేసేవారని అక్కడ సంపాదించుకున్న కొంత మొత్తాన్ని తన సొంత పొలంలో వ్యవసాయ పనుల నిమిత్తం పెట్టుబడి పెట్టి అప్పుల పాలైన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ నాయకులకు మా ఓట్లు మాత్రమే అవసరం కానీ రైతాంగ సమస్యలు పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు అప్పులు చేసి పంటలు సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి నెలకొందన్నారు.అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలోని నాయకులు రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా స్వార్ధ రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో సరైన వర్షాలు లేక వేరుశనగ పంటతో పాటు ఇతర పంటలు పూర్తిగా ఎండిపోయాయని వాటిని ఏం చేయాలో దిక్కుతోచక రైతులు పంటలను తొలగించే పరిస్థితి నెలకొందన్నారు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కాలయాపన చేస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ రైతులకు చేసిందేమీ లేదని ఆరోపించారు.వ్యవసాయ పనులు చేసి రైతులు నష్టపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా రైతుల జీవితాలతో చెలగాటం మాడుతుందని ప్రభుత్వాన్ని విమర్శించారు.గత 15 సంవత్సరాల క్రితం హంద్రీనీవా కెనాల్ కింద తవ్విన పిల్లి కాలువలు పూర్తిగా చెట్లు పెరిగి కనిపించకుండా పోయాయన్నారు.ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యంతో పిల్లి కాలువల పనులు ప్రారంభించిన పిల్లి కాలువలకు హంద్రీనీవా సరఫరా చేయకపోవడంతో రైతులు నష్టపోయారన్నారు. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు సిపిఎం మండల కన్వీనర్ విరుపాక్షి, రైతు సంఘం నాయకులు సీనప్ప, సిద్ధప్ప, మురళి, రవి, సుధాకర్,రైతులు తదితరులు పాల్గొన్నారు.










