- సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు
ప్రజాశక్తి-విజయవాడ : దేశ్ కి బచావో ! మోడీకి హటావో !! బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ, మతోన్మాద విధానాలపై సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కండ్రిక సెంటర్ లో ప్రచార భేరి కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ముందుగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రారంభ ఉపన్యాసం చేసారు.
👉 ప్రత్యేక హోదా లేదు, సాధన లేదు
👉 ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధుల కేటాయింపు లేదు
👉 నరేంద్రమోడీ యువతని మోసం చేస్తున్నారు
👉 రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వట్లేదు
👉 విదేశీ నల్లదనం తెప్పించి ప్రజల అకౌంట్స్ వేయలేదు
👉 ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, విమానం, బిఎస్ఎన్ఎల్ అమ్మకం
బాబురావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ దేశాన్ని సంస్కరణ బాట పట్టారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే బ్యాంక్ ఎల్ఐసి విమానయానం లను కార్పొరేట్లకు దానదాత్తం చేస్తున్నారని, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయన్నారు. జగన్ సింహం వస్తానని చెప్పి నరేంద్ర మోడీ బోనులో ఇరుక్కున్నరన్నారు. ప్రత్యెక హోదా అడిగితే పాత కేసులుతో అరెస్ట్ చేస్తారనే భయం వుందని నోరు తెరవట్లేదన్నారు
సిపిఐ నగర సహయ కార్యదర్శి లంకా దుర్గారావు కార్యదర్శివర్గ సభ్యులు కేవి భాస్కరరావు, తాడి పైడయ్య, నగర నాయకులు బుట్టి రాయప్ప, పంచదార్ల దుర్గాంబ, పి రాణి, ఒర్సు భారతి, పుష్ప, టి దుర్గ, రమణమ్మ, అనీల్, కె అర్ ఆంజనేయులు, కె ఆదినారాయణ, డి సూరిబాబు, కొడాలి ఆనందరావు, ఎం శివకుమార్, రఘురామరాజు, పాపారావు, తదితరులు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు దొనెపూ డి కాశీనాధ్, నగర నాయకులు బుపతి రమణ, గడ్డం ఝాన్సి, పిచెమ్మ, కె దుర్గారావు, సి హెచ్ శ్రీనివాస్, వెంకటరెడ్డి సాంబిరెడ్డి, పులి కృష్ణ మూర్తి, ప్రభుదాస్, సుందరరామరాజు, తదిరులు పాల్గొన్నారు.










