ప్రజాశక్తిఆత్మకూరు : ఆత్మకూరు మండలం కేంద్రంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన ఆత్మకూరు పంచాయితీ పరిధిలోని కుర్లపల్లి గ్రామంలో నీటి సమస్య కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి పి.రామకృష్ణ హాజరై మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా గ్రామంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని అడపాదడపా సత్యసాయి నీళ్లు వస్తుండడంతో ఆ నీటితోనే గ్రామస్తులు వంతులు వేసుకొని చేరో రెండు మూడు బిందులు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉండేవారని పాడి పశువులకు నీళ్లు ఎక్కువ మొత్తంలో అవసరం పడుతూ ఉండడం వలన రెండు మూడు రోజులకు ఒకసారి వచ్చే సత్యసాయి వాటర్ చాలీచాలక గ్రామంలో మహిళలు చాలా ఇబ్బందులు పడి చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పంపుసెట్లు దగ్గరకు వెళ్లి అక్కడనుండి నీళ్లు తెచ్చుకొనే క్రమంలో మహిళలు ఆ రైతులతో చివాట్లు పడుతూ కూడా ఏమీ దిక్కుతోచని పరిస్థితులలో అలాగే పగలంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నీటి కోసం మహిళలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఎన్నోసార్లు అధికారులకు సమస్య విన్నవించినప్పటికీ మీ గ్రామంలో బోర్లు వేస్తే నీళ్లు పడవని కుంటి సాకులు చెబుతున్నారన్నారు ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని జియాలజిస్ట్ ల ద్వారా నీళ్లు స్పష్టంగా ఎక్కడ పడతాయో ఎన్ని అడుగులలో నీళ్లు ఉన్నాయో తెలుసుకొవచ్చాన్నారు ఇప్పటికైనా బోర్లు వేసి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యని శాశ్విత పరిష్కారం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది లేనిపక్షంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పార్టీ కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్షలు చేయడానికైనా సిద్ధం అవుతామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ సహాయ కార్యదర్శి జి. శ్రీకాంత్ టీవీ గౌని.శారద సిపిఐ నియోజకవర్గ నాయకులు జి. దుర్గాప్రసాద్, రామాంజనేయులు, సరస్వతమ్మ, గ్రామస్తులు,రవితేజ, మల్లికార్జున, బ్రహ్మయ్య, హనుమంతు, పవన్, నాగన్న,అనసూయమ్మ, అరుణమ్మ, రామాంజనమ్మ, మహిళలు పాల్గొన్నారు










