Oct 20,2023 15:07
  • జిల్లా రైతుసంఘ౦ ప్రధానకార్యదర్శి చిన్నప్పయాదవ్

ప్రజాశక్తి-నార్పల : నార్పల స్టేట్ బ్యాంక్ వద్ద శుక్రవారం రైతుసంఘముతరపున డి.చిన్నప్పయాదవ్ ,సీపీఐ మండలకార్యదర్శి గంగాధర అద్వర్యంలో నిరసన కార్యక్రమ0 నిర్వహించారు ఈ సంధర్బంగా ఏపిరైతుసంఘము జిల్లాప్రధానకార్యదర్శి డి.చిన్నప్పయాదవ్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం కౌలురైతులకు పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చినప్పటికి బ్యాంకులు కౌలు రైతులకు. రుణాలు మంజూరు చేయడంలో ఆలసత్వం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టం (2019)లో కూడా రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ చట్టం ప్రకారం సి.సి. ఆర్సీలు (గుర్తింపు కార్డులు) పొందిన కౌలు రైతుల నుండి ఏ ఇతర పత్రాలు అడక్కుండానే, ఎటువంటి షూరిటీ లేకుండానే పంట రుణాలు ఇవ్వాలనే నిబంధనలను చట్టంలో పొందుపరిచారు. దాని ప్రకారం బ్యాంకులు రుణాలు ఇచ్చి కౌలు రైతులను ఆదుకోవాలి. జిల్లాలో సాగుభూములల్లో 80% పంటలు పండిస్తున్నది కౌలురైతులే. అంతే గాకుండా సాగుదారులలో 70% మంది కౌలురైతులే ఉన్నారు. సాగు చేస్తున్న భూమి దామాషా ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి. రాష్ట్ర బ్యాంకర్స్ కమిటీ నిర్ణయించుకున్న టార్గెట్ ప్రకారం మన బ్రాంచిలో రుణాలు ఇవ్వటం లేదు. రిజర్వ్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రూ॥ 1,50,000 వరకు ఎటువంటి హమీ లేకుండానే రుణాలు ఇవ్వాలని చెబుతున్నాయి. అంతేకాకుండా కౌలు రైతులకు పంట హమీగా పంటరుణాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ బ్యాంకులు పట్టించుకోవడం లేదు. కౌలు గుర్తింపు కార్డు పొందినప్పటికీ భూయజమాని వచ్చి సంతకం పెడితేనే పంట రుణాలు ఇస్తామని అంటున్నారు. సి.సి. ఆరీ కార్డు లేని కౌలురైతులు జాయింట్ లైయబులిటీ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటే ఆ గ్రూప్ షూరిటీగా పంటల రుణాలు ఇవ్వాలి. కానీ గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు పెట్టడం సరైంది కాదని.వాస్తవ సాగుదారులైన కౌలురైతులందరికి పంట రుణాలు ఇవ్వాలని కోరుతున్నాము. తీసుకోవలసిన చర్యలు:

సీసీ ఆర్సీ కార్డులు( గుర్తింపు కార్డులు) పొందిన ప్రతి కౌలురైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం స్యూరిటీ లేనిపంట రుణాలు అందించాలి.  ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టం (2019)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కౌలుగుర్తింపు కార్డులు పొందిన కౌలురైతులకు ఏ ఇతర పత్రాలు అడక్కుండానే పంట రుణాలు మంజూరు చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) నిబంధనల ప్రకారం రూ॥ 1,60,000 వరకు ఎటువంటి షూరిటీ లేకుండానే కౌలు రైతులకు పంట రుణాలు అందించాలి. 
 భూయజమానితో సంబంధం లేకుండానే కౌలురైతులకు పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. సీసీఆర్సీ కార్డులు లేకపోయినా వ్యవసాయ అధికారుల గుర్తింపుతో జాయింట్ లైబులిటి గ్రూపులో ఏర్పాటు చేసుకున్న కౌలురైతులందరికీ పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలి.రుణాలు పొందిన కౌలురైతులకు సున్నావడ్డీ పథకాన్ని వర్తింపజేయాలి. దేవాలయ భూములు సాగుచేస్తున్న కౌలురైతులకు, లంక భూములు, సొసైటీ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఇవ్వాలి. పాల్గోన్నవారు, సీపీఐ మండల సహయ కార్యదర్శులు, రామాంజినేయిలు, రమేష్ , సీపీఐ సీనీయర్ నాయకులు సుధాకర, రైతుసంఘము మండల అద్యక్షులు, జోసెప్, లలితమ్మ, సంజీవరాయిడు, కుల్లాయప్ప, బాషా, నాగప్ప, కౌలురైతులు తదితరులు పాల్గోన్నారు.