
ప్రజాశక్తి-నందిగామ : రౌడీ షీటర్లు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నందిగామ సిఐ హనీష్ హెచ్చరించారు. నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రత పరిరక్షణ కొరకు కమిషనర్ కాంతి రానా టాటా ఆదేశాల మేరకు ఏసిపి జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో సిఐ హనీష్ టౌన్ పరిధిలో నివసిస్తున్న రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ హనీష్ రౌడీషీటర్లతో మాట్లాడుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే విధముగా రౌడీ షీటర్లు ఏ విధమైన అవంతరాలు కలిగించరాదని, చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎస్సై పండు దొర, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.