Sep 07,2022 07:51

న్యూఢిల్లీ :   భారత్‌ బయోటెక్‌ రూపొందించిన నాజల్‌ వాక్సిన్‌ (ముక్కులో వేసే చుక్కల మందు) అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది.  వ్యాక్సిన్‌ తయారీ, వినియోగానికి నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాజల్‌ స్ప్రే కోసం డ్రగ్స్‌ క్రంటోల్‌ ఆఫ్‌ ఇండియా నుండి ఆమోదం పొందిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు.  పేజ్‌ 3 క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ లోడ్‌ 24 గంటల్లో 94 శాతం తగ్గించగా, 48 గంటల్లో 99 శాతానికి తగ్గించిందని ఒక  ప్రకటనలో తెలిపారు.  పెద్ద వయస్సుల వారి చికిత్స కోసం ముంబయికి చెందిన గ్లెన్‌మార్క్‌ సానొటైజ్‌ సంస్థ భాగస్వామ్యంలో ఫిబ్రవరిలో దేశంలోనే మొదటి నాజల్‌ స్ప్రే (ఫాబిస్ప్రే) తయారీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే  దేశంలోనే అనుమతి పొందిన మొదటి నాజల్ వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం.   నియమిత పరిమితుల మధ్య పెద్దలు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించవచ్చని మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్‌ సైన్స్‌ అధ్యయనం, అభివృద్ధి, మానవవనరులను సమృద్ధిగా వినియోగించుకుంటుందని అన్నారు.