Dec 28,2022 11:17

న్యూఢిల్లీ : కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సూది లేకుండా ముక్కు ద్వారా ఇచ్చే బూస్టర్‌ టీకా (ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌) ధర రూ.800గా ఉంటుందని భారత్‌ బయోటెక్‌ మంగళవారం తెలిపింది. ఈ టీకాను 18 ఏళ్లుపైపడిన వారికి బూస్టర్‌ డోస్‌గా వినియోగించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోద ముద్ర వేసిన సంగతి విదితమే. అయితే మార్కెట్లో ఈ టీకాను రూ.800కు విక్రయిస్తా మని, ప్రభుత్వానికి రూ.325కు విక్రయిస్తామని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.