- 150 సంవత్సరాలు చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ.
- కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి బిజెపికి లేదు
- సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఓలేటి .
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : 150 సంవత్సరాల గల కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి బిజెపికి లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఓలేటి రాయి భాస్కరరావు అన్నారు. బుధవారం కొత్తపల్లి లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఈనెల 24వ తేదీన విజయవాడలో జింఖానా గ్రౌండ్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న కాంగ్రెస్ మహాసభను విజయవంతం చేయాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓలేటి రాయ భాస్కరరావు పిలుపునిచ్చారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా విచ్చేసి సభను జయప్రదం చేయాలని ఓలేటి రాయి భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ప్రసంగిస్తారన్నారు .150 ఇయర్స్ గల కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు బిజెపికి గాని ప్రధాన నరేంద్ర మోడీకి గాని లేదన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగిందని ఓలేటి రాయి భాస్కర్ రావు అన్నారు.










