Apr 23,2023 16:53

ప్రజాశక్తి-ఏలేశ్వరం : ఆల్ ఇండియా పోలీస్ కోకో టోర్నమెంట్లో అథ్లేటిక్స్ క్లస్టర్ లో తృతీయ స్థానం పొందిన ప్రత్తిపాడు స్టేషన్ కానిస్టేబుల్ జి అప్పారావును పలువురు అభినందించారు. ఈ మేరకు అప్పారావును ఏపీ డీజీపీ కే రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డ్, వార్షిక ఇంక్రిమెంట్, ఏపీ పోలీస్ పండ్ నుండి లక్ష రూపాయలు నాగదు బహుమతి అందజేశారు. జిల్లా ఎస్పీ కూడా కానిస్టేబుల్ అప్పారావును  అభినందిస్తూ క్యాష్ రివార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా విజేత అప్పారావును పెద్దాపురం డి.ఎస్.పి సుంకర మురళీమోహన్, ప్రత్తిపాడు సిఐ కె కిషోర్ బాబు, ఎస్సై పవన్ కుమార్ ప్రత్తిపాడులో ప్రత్యేకంగా అభినందిస్తూ అప్పారావు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో ప్రతిపాడు సర్కిల్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.