May 05,2023 15:46

ప్రజాశక్తి - యానాం : యానాం ప్రథమ ప్రాంతీయ పరిపాలనాధికారి దడాల రమణయ్య వర్ధంతిని సమాచార శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జెండా స్తంభం వద్ద నున్న ఆయన విగ్రహానికి ప్రాంతీయ పరిపాలన అధికారి ఆర్ మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ ద్విజ్ గోయల్, సీఐ షణ్ముగంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చెల్లి గోపీనాథ్, నల్లా సూర్యప్రకాష్ రావు, రమణయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.