Oct 01,2023 15:55
  • అచ్చంపేటలో శ్రమదానం

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ : పరిశుభ్రవంతమైన సమాజం కోసం ఆరోగ్యవంతమైన జీవితం కోసం స్వచ్ఛత ఈ సేవ శ్రమదానం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల కాకినాడ ఎంపీ వంగా గీత తదితరులు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ పిలుపుమేరకు  స్వచ్ఛత హి సేవ శ్రమదానం, క్లాత్ మిత్రులకు సత్కారం, క్లాప్ మిత్ర లతో తేనీ టి విందు వంటి కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల, ఎంపీ వంగా గీత, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తదితర అధికారులు బృందం ఆదివారం జోరుగా హుషారుగా పాల్గొన్నారు.అచ్చంపేట గ్రామ పంచాయితీ నందు  స్వచ్ఛత హై సేవ కార్యక్రమం ఆదివారం చేపట్టారు.. సదరు కార్యక్రమం నందు క్లాప్ మిత్రాలకు సన్మానం చేసి, కాఫీ విత్ క్లాప్ మిత్రా , ర్యాలీ నిర్వహించారు తదుపరి ఎక్ తారిఖ్ ఏక్ గంట ఏక్ శాత్ లో భాగముగా శ్రమదానం చేశారు. సదరు ప్రోగ్రాం నకు కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతీకా శుక్లా,పార్లమెంటు సభ్యులు  వంగా గీత విశ్వనాథ్ , రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్  చైర్మన్, పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జి దవులూరి దొరబాబు ,  జిల్లా పరిషత్ సీ ఈ ఒ రమణ రెడ్డి, , కాకినాడ ఢీ ఎల్ ఢీ ఒ పీ నారాయణ మూర్తి,,  ఎం పీ పీ బొబ్బరాడ సత్తిబాబు , ఎంపిడిఓ డి.శ్రీ లలిత, ఈ ఓ పీ ఆర్ ఢీ కె.హరికృష్ణ సత్య రెడ్డి, ఎం.పి.టి.సిలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, పంచాయితీ కార్యదర్శులు, పంచాయితీ మరియు సచివాలయం సిబ్బంది, క్లాప్ మిత్రాలు పాల్గొన్నారు.