ప్రజాశక్తి-కాకినాడ : ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ ని పూర్తిగా ఆరోగ్యశ్రీ పధకంలో చేసి క్యాన్సర్ రోగి ప్రాణాలను కాపాడిన కాకినాడ మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బందిని కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అభినందించారు. ఉభయ గోదావరి జిల్లా లోనే మొట్ట మొదటి సారిగా మెడికవర్ హాస్పిటల్స్ నందు డాక్టర్ మురళీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ ని విజయవంతంగా నిర్వహించినందుకు గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా డా.మురళీధర్, సెంటర్ హెడ్ సిద్దారెడ్డి, మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బందిని అభినందించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ ఖర్చు లేకుండా పూర్తిగా ఈ చికిత్సను ఉచితంగా అందించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మురళీధర్, సెంటర్ హెడ్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ వెన్నునొప్పితో బాధపడుతున్న పాలిక సత్యనారాయణ 50 ఏళ్ళ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా మైలోమ అనే రక్త క్యాన్సర్ ఉన్నట్టు నిర్దారించడం జరిగిందన్నారు. సకాలంలో సరైన చికిత్స అందించడం వల్ల పేషెంట్ ప్రాణాలను కాపాడగలిగామన్నారు. 6,50,000 రూపాయల ఖర్చు గల మైలోమ చికిత్స ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయడం జరిగిందన్నారు. ఈ విషయమై రోగి క్షేమ సమాచారం తెలుసుకుని పేషెంట్ కి, మెడికవర్ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ యూనిట్ హెడ్ సిద్ధారెడ్డి, డా. మురళీధర్, డా. పి.రాధాకృష్ణ, (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్-ఆరోగ్యశ్రీ), కె.నవీన్ (డిస్ట్రిక్ట్ మేనేజర్-ఆరోగ్యశ్రీ) పాల్గొన్నారు.










