May 10,2023 12:07

ప్రజాశక్తి-ఆదోని : కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన బుధవారం ఆదోనిలో పర్యటించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద కలెక్టర్ సృజన కు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి,ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆదోని లో బైపాస్ రోడ్డు నిర్మాణము, పట్టణంలో రోడ్లు వెడల్పు ఇతర అభివృద్ధి పనుల కోసం సహకరించాలని కలెక్టర్ ను కోరామని ఎమ్మెల్యే తెలిపారు. పెండింగ్ పనులు పూర్తయ్యేలా చూస్తామని కలెక్టర్ తెలిపారన్నారు.