ప్రజాశక్తి-పత్తికొండ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఒక వరమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. బుధవారం పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి స్వగృహంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అర్హులైన లబ్ధిదారులు పత్తికొండ నియోజకవర్గ పరిధిలో తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన షర్ఫున్ బి 6,00,000/- రూపాయలు, కరెంట్ షాక్ తో మూడు సంవత్సర క్రితం మృతి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు సుగాలి రంగడు నాయక్ కి 2,00,000/- రూపాయలు, వివిధ కారణాలతో మృతి చెందిన సూదేపల్లె లొడ్డ రాజ్ కుమార్ 1,00,000/- రూపాయలు, బోగోలు రాజేష్ కు 1,00,000/-రూపాయలు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలోనికి రాని రోగాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక రోగాలకు ఆపరేషన్లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. పేదవారి ఆరోగ్యానికి, జీవితాలకు అండగా నిలుస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుండి ఆర్థిక బోరాసాన్ని కల్పిస్తున్నాడని తెలిపారు. ఆరోగ్యశ్రీలో 1000కి పైగా రోగాలను చేర్చడం జరిగిందని, అంతేకాకుండా మిగతా రోగాలకు సీఎంఆర్ఎఫ్ నుండి సహాయమందించడం జరుగుతుందన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీదేవి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.










