ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : సుప్రసిద్ధ సాహితీవేత్త, తెలుగు సంస్కృత భాషా పండితులు ఆచార్య డాక్టర్ రవ్వా శ్రీహరి శుక్రవారం (80) అర్ధరాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. వయోభారంతోపాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. నల్గండ జిల్లా వెల్వర్తికి చెందిన శ్రీహరి సామాన్య చేనేత కుటుంబంలో పుట్టారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌లో అధ్యాపకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం తెలుగు హెచ్‌ఒడిగా, ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షునిగా, టిటిడి ప్రచురణల విభాగం ఇన్‌ఛార్జి ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు భాషలో 50కిపైగా గ్రంథాలను, సంస్కృతంలో 25 పుస్తకాలను రచించారు.
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం
శ్రీహరి మృతి పట్ల ఎపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.










