ప్రజాశక్తి-ఆదోని : మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి ఈరన్న, బి రామాంజనేయులు, పట్టణ కార్యదర్శి పిఎస్ గోపాల్, సహాయ కార్యదర్శి లక్ష్మన్న డిమాండ్ చేశారు. ఆదోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలోని శుక్రవారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో కమిషనర్ రఘునాథ్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, పనిముట్లు, డ్రస్సులు అందజేయాలన్నారు. రక్షణ సామాగ్రిని ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారన్నారు ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే మాట మార్చడం సమంజసం కాదన్నారు 2014 కన్నా ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటన సరికాదన్నారు షరతులు లేకుండా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని లేనియెడల దశలవారీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, సోమన్న, కర్రెప్ప, హనుమంతు, ఈరన్న, ముని, బాష, అహ్మద్ ఉద్యోగులు వున్నారు.










