ప్రజాశక్తి-పెద్దకడబూరు : ఏపీ విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న డిమాండ్ చేశారు. బుధవారం పెద్దకడబూరు మండలంలోని సొసైటీలో సిఐటియు కార్యకర్తల సమావేశం సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న గౌడ్ మరియు పరమేష్ ఉప్పర శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ 2023 లో ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. 2023 -24 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి కల్పన దేశీయ డిమాండు ప్రజలు కొనుగోలు శక్తిని పెంచడం వంటి కీలక అంశాలను ప్రస్తావించలేదన్నారు. దేశంలో గత రెండేళ్లలో ఉత్పత్తి అయిన మొత్తం సంపదలో 40.5% దాకా వేలం ఒకే ఒక్క శాతంగా ఉన్న సంపన్నులను వద్ద పోగు పడిందని అక్షపం నివేదిక బయటపెట్టిన సమయంలో ఈ బడ్జెట్ వచ్చిందని తెలిపారు.










