- సిఐటియు
ప్రజాశక్తి-నందిగామ : మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు వేతనాలు మెనూ చార్జీలు బడ్జెట్ మరియు ఉపాధి భద్రత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని జూలై 31వ తేదీన విజయవాడలో ధర్నా చౌక్లు ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కె. గోపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ పథకంలో పని చేస్తున్న కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, ప్రతి నెలా 5వ తేది లోపువేతనాలు, బిల్లులు ఇవ్వాలని కోరారు. మెనూచార్జీలకు రూ.20/-లు ఇవ్వాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, వంటచేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైన వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వంట చేస్తుందగా అగ్నిప్రమాదం జరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన కార్మికురాలు మలిపెద్ది రమాదేవి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 20లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మల్లి పెద్ది రమాదేవి కుటుంబం అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
గుర్తింపు కార్డులు యివ్వాలన్నారు. పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, పథకం అమలుకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, హైస్కూలులో పనిచేస్తున్న వారికి వేతనం యివ్వాలన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. రాగి జావ తయారు చేయడానికి, వంటపాత్రలు, గ్యాస్టవ్, గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు చందర్లపాడు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు, మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి ఆదూరు సుశీల, తాటి తులసమ్మ, కోయ నాగేంద్రం, దుర్గ, మల్లేశ్వరి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.










