బీజింగ్ : అమెరికా గగనతలంలో ఎగురుతున్న చైనా మానవ రహిత విమానానిు కూల్చివేయడంపై చైనా సోమవారం స్పందించింది. చైనా ప్రయోజనాలను దెబ్బ తీసే చర్యలు చేపట్టవద్దని లేదా ఉద్రిక్తతలను పెచ్చరిల్లేలా చేయవద్దని అమెరికాను చైనా కోరింది. ఆ మానవ రహిత విమానం పౌర ప్రయోజనాలకు ఉద్దేశించినదేనని, ప్రమాదవశాత్తూ అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంటోంది. అమెరికా పాల్పడిన ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, నిరసన తెలియచేస్తోందనిచైనా ఉప విదేశాంగ మంత్రి జీ ఫెంగ్ పేర్కొనాురు. చైనాలోనిఅమెరికా ఎంబసీ వ్యాఖ్యలకు స్పందనగా ఈ ప్రకటన వెలువడింది. తాజా పరిణామాలను, అక్కడి పరిస్థితిని చైనా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరపడేందుకు ఇండోనేషియాలోని బాలీలో ఇరు దేశాల నేతలు సమావేశమైనప్పటి నుండి చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతి తాజాగా అమెరికా తీసుకున్న చర్య వల్ల తీవ్రంగా దెబ్బతిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో ఇరు దేశాల మధ్య వున్న ఉద్రిక్తతలను మరింత పెచ్చరిల్లలా చేయవద్దని పేర్కొంది. కాగా దక్షిణ కరొలినా తీర ప్రాంతంలో శనివారం నాడు చైనా నిఘా విమానానిు అమెరికా మిలటరీ కూల్చి వేసినట్లు పెంటగన్ ధృవీకరించింది.










